మహేశ్ బాబు అందం వెనుకున్న సీక్రెట్ ఇదే..!

మహేశ్ బాబును చూస్తుంటే ఏం అనిపిస్తుంది.. వయసుపెరుగుతున్నా.. తగ్గుతున్నట్లు ఉంటుంది కదూ.. 47 సంత్సరాలు వచ్చినా.. చూడ్డానికి 30 ఏళ్ల యువకుడిలా ఉంటాడు.. ఇక ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అసలు మహేశ్ బాబు అంత యంగ్ గా ఎలా అనిపిస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.. 

 

మహేశ్ బాబు అందం గురించి కొందరు ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పారు. తనకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువని, ఆహారం విషయంలో పద్ధతులు పాటిస్తానని తెలిపారు.

 

 ప్రతిరోజూ ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకుంటానని, జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లనని అన్నారు. వీటితో పాటు ఎప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా ఉండటమే తన అందానికి అసలు సీక్రెట్ అంటూ మహేశ్ బాబు బదులిచ్చారు. లోపల ఎంత హ్యాపీగా ఉన్నామో.. అదే బయట కనిపిస్తుందని అన్నారు. చిరునవ్వే నిజమైన అందమని, అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని మహేశ్ బాబు తెలిపారు. 

 

Leave a Comment