ప్రాణాలకు తెగించి ఎస్సై సాహసం..సినిమా తరహా ఛేజింగ్..!

అక్రమార్కుల ఆట కట్టించేందుకు చేజింగ్ లు.. ప్రాణాలకు తెగించి పోరాటాలు చివరికి అరెస్ట్ చేయడాన్ని సినిమాల్లో చూస్తుంటాం. కాని పులివెందులలో.. సినిమా తరహాలో యదార్థ సంఘటన జరిగింది.  పులివెందులలోని రాఘవేంద్ర థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ఓ  కారులో అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పులివెందుల అర్బన్ ఎస్సై గోపీనాథ్ రెడ్డి తన సిబ్బందితో అక్కడకు చేరుకకుని వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా..కారులో ఉన్న వారు కారును ముందుకు, వెనక్కి నడుపుతూ వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. 

అతి వేగంగా వెళ్తున్న ఆ కారు టాప్ పైకి చేరుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వరిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న అక్రమార్కులు వాహనాన్ని ఆపకుండా వేగంగా రెండు కిలోమీటర్ల వరకు వెళ్లారు. అయినా ఎస్సై గోపీనాథ్ రెడ్డి పట్టువదలకుండా కారు ముందు భాగంవైపు అద్దాన్ని పట్టుకుని ఉన్నారు. ఇంకో వాహనంలో అక్కడకు చేరుకున్న పోలీసులు మద్యం ముఠాను అరెస్టు చేశారు.  

అతివేగంగా వెళ్తున్న ఆ కారు టాప్ పై ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ చూసి ప్రాణాలకు తెగించిన పోరాట పటిమను చూసి శభాష్ పోలీస్…ఇలాంటి పోలీసే.. మాకు కావాలి అంటూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.. ప్రాణాలు సైతం పణంగా పెట్టి నేరస్తులను పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్.ఐ గోపీనాధ్ రెడ్డి ని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ ప్రత్యేకంగా అభినందించారు.

 

Leave a Comment