ఉగ్రవాదుల హిట్ లిస్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..భద్రత పెంపు..!

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ పేరు అందరికీ సుపరిచితమే..ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు..ఇటీవల ఫేస్ బుక్ వివాదంలో అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఆయన పేరును ప్రస్తావించింది.. తాజాగా ఆయన ఉగ్రవాదుల లిస్టులో ఉన్నట్లు సమాచారం రావడంతో తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. 

నిఘా వర్గాల హెచ్చరికతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటీవల అరెస్టయిన ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్లు సమచారం రావడంతో ఆయన ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ద్విచక్రవాహనంపై తిరగవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించాలని సూచనలు చేశారు. 

ఈ విషయంపై రాజాసింగ్ స్పందించారు. తనను ఎవరి నుంచి ముప్పు ఉందనే విషయాన్ని చెప్పాలని పోలీసులను కోరారు. మీరు చెప్పకపోయినా..ఎలా తెలుసుకోవాలో తనకు తెలుసన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర హోంశాఖ మంత్రులకు లెటర్ రాస్తానని చెప్పారు. నిజానిజాలు బయటకు లాగుతానని తెలిపారు. 

Leave a Comment