13 ఏళ్ల బాలికపై ఎస్సై అత్యాచారం..!

రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు. రాజకీయ నాయకులు, గూండాలతో కలిసి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులోని చెన్నైలో ఇలాంటి ఘటనే జరిగింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ ఇన్ స్పెక్టర్, ఓ బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాల మేరకు తన అక్క సమిత భానుతో పాటు 13 ఏళ్ల బాలికపై కొంత మంది బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని షబీనా అనే మహిళ రెండు రోజుల క్రితం వాషర్ మెన్ పేట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై ప్రతి రోజు లైంగిక దాడికి పాల్పడుతున్నారని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 8 మందిని అరెస్టు చేకశారు. 

అరెస్టు చేసిన వారిలో బీజేపీ నాయకుడు రాజేంద్రన్ కూడా ఉన్నాడు. ఇతనిని పోలీసులు విచారించగా పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నూరు క్రైం డిపార్ట్మెంట్ ఎస్సై పుహలేంది, తాను కలిసి ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశామని వెల్లడించాడు. దీంతో మహిళా పోలీసులు పుహలెందీని అదుపులో తీసుకొని విచారించారు. పుహలేంది బాలికను తీసుకొని రాజేంద్రన్ కార్యాలయానికి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఎస్సై పుహలేందిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Leave a Comment