82 ఏళ్ల వయస్సులో బామ్మ జిమ్ వర్కవుట్స్..వీడియో వైరల్..!

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెడుతున్నారు. ఇక యువకులు అయితే జిమ్ లకు వెళ్లి వర్కవుట్స్ చేస్తుంటారు. వృద్ధులు మాత్రం వాకింగ్ చేస్తూ తమ ఫిట్ నెస్ పెంచుకుంటారు. కానీ ఈ బామ్మ 82 ఏళ్ల వయస్సులో జిమ్ వర్కవుట్స్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు కూడా బరువులు ఎత్తగలరని నిరూపిస్తోంది.  ప్రస్తుతం ఈ బామ్మ జిమ్ వర్కవుట్స్ వీడియో వైరల్ గా మారింది. 

ఈ బామ్మ ముందు నుంచి చాలా చురుగ్గా ఉండేది. కొన్ని నెలల క్రితం ఆమెకు చీలమండల గాయమైంది. దీంతో మూడు నెలలు నడవలేక మంచానికే పరిమితైంది. ఏడు నెలల కింద మంచం మీద నుంచి పడిపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె మనవడు చిరాగ్ చోర్డియా ఫిట్ నెస్ ట్రైనర్. అతడి ప్రోత్సాహంతో బామ్మ వర్కవుట్లు చేయడం ప్రారంభించింది. బరువులు ఎత్తడం, స్క్వాట్స్ వ్యాయామాలు చేయించాడు. మూడు నెలల కిందట చిరాగ్ బామ్మకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంది. తన పనులు తాను చేసుకోగలుగుతుంది. 

 

Leave a Comment