ఫిజియోథెరపీ ముసుగులో వ్యభిచారం..!

హైదరాబాద్ లో ఫిజియోథెరపీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల మేరకు ఖైరతాబాద్ పరిధిలోనిని ఏసీ గార్డ్స్ లో ఫిజియోథెరపీ క్లినిక్ పేరిట మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఓ కానిస్టేబుల్ ను మఫ్టీలో ఆ ఫిజియోథెరపీ క్లినిక్ కు పంపారు. అనంతరం ఆ కానిస్టేబుల్ నిర్వాహకులకు డబ్బులు ఇస్తున్న సమయంలో పోలీసులు రైడ్ నిర్వహించారు. రెడ్ హ్యాండెడ్ వారిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఫిజియోథెరపీ సెంటర్ నిర్వాహకురాలితో పాటు ఇద్దరు యువతులు, మరో నలుగురు విటులను పోలీసులు అరెస్టు చేశారు.  

 

Leave a Comment