శృంగారంలో వెరైటీ భంగిమ ట్రై చేసి.. ప్రాణాలు కోల్పోయాడు..!

శృంగారాన్ని రకరకాల భంగిమల్లో ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం అనేక భంగిమలను ప్రయత్నిస్తూ తృప్తి పొందుతుంటారు. అయితే అలాంటి వెరైటీ భంగిమను ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాగపూర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఓ యువకుడు గత ఐదేళ్ల నుంచి ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళకు అప్పటికే పెళ్లి అయింది. 

అయినప్పటికీ ఆ మహిళతో సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈక్రమంలో వీరిద్దరు గురువారం రాత్రి నాగపూర్ లోని ఖాపర్ ఖేడా ప్రాంతంలోని ఓ లాడ్జీకి వచ్చారు. అయితే ఈసారి శృంగారంలో వెరైటీ భంగిమను ప్రయత్నించాలని అనుకున్నారు. ఈక్రమంలో మహిళ ఆ యువకుడి కాళ్లను, చేతులను నైలాన్ తాడుతో కుర్చీకి కట్టివేసింది. అలాగే అతని మెడను కూడా మరొక తాడుతో కుర్చీకి కట్టింది. 

అనంతరం ఆ భంగిమలో ఇద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. తర్వాత ఆ మహిళ వాష్ రూమ్ కి వెళ్లింది.  ఆ సమయంలో యువకుడు కూర్చున్న కుర్చీ జారి కిందపడిపోయింది. దీంతో అతని మెడలో ఉన్న తాడు బిగుసుకుపోవడంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. వాష్ రూమ్ నుంచి వచ్చిన మహిళ ఆ యువకుడు చనిపోవడంతో షాక్ కు గురైంది. 

వెంటనే లాడ్జీ సిబ్బందికి సమాచారం అందించింది. వారు కూర్చికి కట్టిన తాళ్లను విపేశారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment