సుమన్ చనిపోయారంటూ ప్రచారం..!

సీనియర్ నటుడు సుమన్ ను కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చంపేశాయి. బతికుడగానే చనిపోయారంటూ ప్రచారం చేశాయి.. ముఖ్యంగా నార్త్ ఇండయాలో కొంత మంది తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.  వాటిని చూసిన సుమన్ అభిమానులు, తెలుగు సినీ ప్రక్షకులు ఆందోళనకు గురయ్యారు.. ఈ వార్త సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేసింది..

ఆయన మరణవార్త తెలుసుకున్న సుమన్ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. యూట్యూబ్ ఛానెళ్లలో ఆయన మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాానని, ఒక సినిమా షూటింగ్ చేస్తున్నానని తెలిపారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానెల్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు సుమన్ స్పష్టం చేశారు.  కొందరు పాపులారిటీ కోసం, వ్యూస్ పెంచుకోవడం కోసం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలకు ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది.    

Leave a Comment