వీడియో వైరల్: పెళ్లి వద్దని పరారైన వరుడు.. వెంబడించి పట్టుకున్న వధువు..!

పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని అబ్బాయి లేదా అబ్బాయిని అమ్మాయి వెంటపడటాన్ని మీరు చూసే ఉంటారు. కానీ పెళ్లి కోసం ఓ యువతి, యువకుడిని వెంబడించడాన్ని ఎప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వద్దని పరారైన ఓ వరుడిని వధువు వెంబడించి పట్టుకుంది. ఈ ఘటన బిహార్ లోని నవాడా ప్రాంతంలో జరిగింది. భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో వరుడి వెంట వధువు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం ఓ యువతికి నిశ్చితార్థం అయ్యింది. వరుడికి రూ.50 వేలు కట్నం, ఓ బైక్ కూడా ఇచ్చారు. అయితే పెళ్లి ముహూర్తం నిర్ణయించడంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో యువకుడి ఇంటికి వెళ్లగా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో వధువు అతడిని వెంబడించి పట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి వరుడు అంగీకరించలేదు. దీంతో పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ యువకుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. ఓ గుడిలో ఇద్దరికీ పెళ్లి జరిపించారు. 

Leave a Comment