పరీక్షల్లో ఫెయిల్ చేశాడని.. టీచర్ ని చెట్టుకు కట్టి కొట్టిన విద్యార్థులు..!

గతంలో గురువుల పట్ల ఎంతో గౌరవం ఉండేది.. కానీ రోజులు మారాయి. గురువులనే ఎదరిస్తున్నారు శిష్యులు.. అలాంటి సంఘటన జార్ఖండ్ లోని డుమ్కా జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ చేశారని.. ఓ ఉపాధ్యాయుడిని ఏకంగా చెట్టుకు కట్టేసి కొట్టారు విద్యార్థులు.. గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ లో గత సోమవారం ఈ సంఘటన జరిగింది.. 

జార్ఖండ్ అకాడమీ కౌన్సిల్ గత శనివారం 9వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. పాఠశాలలోని 9వ తరగతిలో 32 మంది విద్యార్థులు ఉండగా.. 11 మంది ప్రాక్టికల్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. దీంతో మార్కులు వేసిన ఉపాధ్యాయుడిని, మార్కులను జేఏసీ సైట్ లో అప్ లోడ్ చేసిన క్లర్క్ ని చెట్టుకు కట్టేసి చితకబాదారు.. 

ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందనే కారణంతో ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారని తెలిపారు. బాధిత ఉపాధ్యాయుడు సుమాన్ కుమార్, క్లర్క్ సొనేరామ్ చౌరే కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. 

Leave a Comment