ఉత్పత్తులు మేడ్ ఇన్ ఇండియా మరియు మేడ్ ఫర్ ది వరల్డ్ గా ఉండాలి : మోడీ

భారత దేశ ఉత్పత్తులు ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా మరియు మేడ్ ఫర్ ది వరల్డ్ గా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా, ఉత్పత్తులను తయారు చేసేలా ఉండాలని చెప్పారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(సీఐఐ) వార్షిక సమావేశంలో ప్రధాని మోడీ మంగళవారం ప్రసంగించారు. ప్రభుత్వం వివిధ సంస్కరణలను కొనసాగిస్తుందని, కచ్చితంగా ఆర్థిక వృద్ధిని తిరిగి పొందుతుందని అన్నారు. 

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని చెప్పారు. క్రమంగా వ్యాపారాలను కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించవచ్చని ప్రధాని తెలిపారు. 

భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడం అవసరం అన్నారు. గ్లోబల్ సప్లయి చైన్ లో భారతదేశం కీలకపాత్ర పోషించటానికి మొదట బలమైన లోకల్ సప్లయి చైన్ ను సృష్టించాలని స్పష్టం చేశారు. పెట్టుబడి మరియు వ్యాపారం కోసం అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. 

లక్షలాది ఎంఎస్ఎంఈలు భారతదేశం యొక్క మొత్తం వృద్ధికి ఇంజన్లని తెలిపారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని ఎంతో గౌరవిస్తుందని, భారత్ పై నమ్మకాన్ని కలిగి ఉందని చెప్పారు.  

 

Leave a Comment