శ్రీవారి దర్శనానికి అనుమతి

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఆరడగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 

కరోనా వైరస్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం రెండు నెలలకు పైడా మూతపడింది. అయితే లాక్ డౌన్ 5.0లో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు దర్శనం కల్పించాని టీటీడీ ఈవో ప్రభుత్వానికి లేఖ రాశారు. 

ఈ లేఖకు ప్రభుత్వం స్పందించింది. దర్శనానికి అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ శ్రీవారి దర్శనానికి కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Leave a Comment