ప్రిన్స్ మహేష్ బర్త్ డే గిఫ్ట్ సూపర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం 45వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మూవీ టీమ్ మహేష్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మోషన్ పోస్టర్ లో సర్కారు వారి పాట అంటూ బ్యాక్ గ్రౌండ్ లో అద్దిరిపోయే మ్యూజిక్ వస్తుంది. అందులో మహేష్ రూపాయి బిళ్లను ఎగిరేస్తూ మ్యాజిక్ చేస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ఇటీవలే మహేష్ తండ్రి క్రిష్ణ పుట్టిన రోజు కానుకగా 27వ సినిమా టైటిల్ ‘సర్కారు వారి పాట’ ను ప్రకటిస్తూ ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..

ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా…మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినమాకు సంగీతం అందిస్తున్నారు. 

 

Leave a Comment