లవంగాలు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలతో ఇమ్యూనిటీని పెంచే చీరలు..!

ప్రస్తుతం ప్రజలంతా తమ ఇమ్యూనిటీని ఎలా పెంచుకునే పనిలో పడ్డారు. దీంతో వ్యాధి నిరోధక శక్తిని పంచే ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే పానియాలు, టెబ్లెట్లు మరియు పాపడ్ తో సహా ఆరోగ్య స్పృహ కోసం అనేక వింతులు మార్కెట్ లోకి వచ్చేశాయి. తాజాగా మరో ప్రాడెక్ట్ కూడా వచ్చి చేరింది. అదే రోగనిరోధక శక్తిని పెంచే చీర. అవును ఇది నిజమే..

రోగనిరోధక శక్తిని పెంచే చీరలు ఇటీవల మధ్య ప్రదేశ్ మార్కెట్ లోకి వచ్చేశాయి. ఈ చీరలకు ‘ఆయుర్ వస్త్రా’ అని పేరు కూడా పెట్టారు. వాటిని మధ్యప్రదేశ్ చేనేత మరియు హస్తకళల కార్పొరేషన్ విక్రయిస్తోంది.  రకరకాల సుగంధ ద్రవ్యాలతో ఈ చీరలను తయారు చేసినట్లు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఈ చీర ధర రూ.3వేలకుపైగా ఉంటుంది. ప్రస్తుతం వీటిని భోపాల్ మరియు ఇండోర్లలో విక్రయిస్తున్నారు. త్వరలో భారతదేశం అంతటా అందుబాటులోకి తెస్తామని తయారీదారులు చెబుతున్నారు. 

రోగనిరోధక శక్తిని పెంచేందుకు శతాబ్దాల నాటి పద్ధతిని ఉపయోగించి ఫాబ్రిక్ ప్రాసెస్ చేసినట్లు భోపాల్ కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ పేర్కొన్నారు. ఒక చీర తయారు చేయడానికి ఐదు నుంచి ఆరు రోజుల సమయం పడుతుందని తెలిపారు. లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బే ఆకు తదితర సుగంధ ద్రవ్యాలతో ఈ చీరలను తయారు చేసినట్లు చెప్పాడు. సుగంధ ద్రవ్యాలను చూర్ణం చేసి 48 గంటల పాటు నీటిలో నానబెడతారు. తర్వాత దానిని మరగబెట్టి దాని నుంచి వచ్చిన ఆవిరిని చీర లేదా ఇతర దుస్తులు తయారు చేసే వస్త్రానికి పట్టిస్తారు. ఆ వస్త్రంతో చీరులను తయారు చేస్తారు. ఈ దుస్తులలో ఇమ్యూనిటీ పెంచే ప్రభావం నాలుగైదు ఉతుకుల వరకు ఉంటుందని వినోద్ తెలిపారు. 

Leave a Comment