పెట్రోల్ ధరలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు ధరల్లో పెరుగుదల మాత్రమే ఉంది.. కానీ తగ్గుదల లేదు. ఈక్రమంలో దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. 

ఈసందర్భంగా ప్రధాని మోడీ పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించారు. గత నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాయని అన్నారు. మిగగా రాష్ట్రాలు ఇప్పటికైనా వ్యాట్ తగ్గించాలని ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. 

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే పెట్రోల్ ధరలు తగ్గుతాయని ప్రధాని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తితో పెట్రోల్ పై పన్నులు తగ్గించాలని కోరారు. అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరాఖండ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.104 ఉందని, ఎక్కువగా మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ ధర రూ.122గా ఉందని తెలిపారు. వ్యాట్ తగ్గించిన రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు.  

 

Leave a Comment