విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకండి.. ప్రధాని మోడీకి లేఖ..!

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై 100 మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని లేఖలో కోరారు. దేశంలో తాము అతిపెద్ద సామాజిక ముప్పును ఎదుర్కొంటున్నామని, ఇది కేవలం రాజ్యాంగ నైతికత, ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నారు.. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లింలు మతపరమైన ద్వేషానికి ఎక్కువగా గురవుతున్నారని, బీజేపీ శాంతి, సామరస్యాన్ని కాపాడే సాధనంగా కాకుండా, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేసే సాధనంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా కోరారు.. 

మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. మన వ్యవస్థాపక పితామహులు సృష్టించిన రాజ్యాంగ విధానాన్ని నాశనం చేసేలా పరిస్థితి తలెత్తడంతోనే తమ ఆవేదనను, భావనను, వ్యక్తికరించేలా ఈ లేఖ రాసేందుకు పురికొల్పిందన్నారు. 

ఈ లేఖలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లయి, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్ తో సహా 108 మంది సంతకాలు చేశారు. 

 

 

Leave a Comment