2030 నుంచి ఏడాదికి 560 విపత్తలు.. ఐరాస హెచ్చరిక..!

ప్రకృతి విధ్వంసం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వినాశనం తప్పదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. పర్యావరణ పర్యవసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇది ఇలాగే 2030 నుంచి ఏడాదికి 560 విపత్తులను చూడాల్సి వస్తుందని తెలిపింది. 2015లో అత్యధికంగా 400 విపత్తులు ఎదురైవగా.. రానున్న రోజుల్లో మరిన్ని విపత్తులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

560 విపత్తులు అంటే రోజుకు దాదాపు ఒకటిన్నర విపత్తు అన్న మాట.. వరదలు, తుఫాన్ లు, భూకంపాలు, కొత్త వ్యాధులు, రసయాన ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు.. ఇలా అనేక రూపాల్లో ఈ విపత్తులు ఎదురవుతాయి. 1970-2000 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 90-100 విపత్తులు నమోదైనట్లు ఐరాస నివేదిక తెలిపంది. 

మరోవైపు 2001లో నమోదైన వేడిగాలల కంటే మూడు రెట్లు అధికంగా 2030లో నమోదవుతాయని నివేదిక పేర్కొంది. కరువులు కూడా 30 శాతం పెరుగుతాయి. అంతేకాకుండా.. ఆర్థిక మాంద్యాలు, వ్యాధులు, ఆహార కొరత లాంటివి సంభవిస్తాయని నివేదిక హెచ్చరించింది. విపత్తుల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ఉంటుందని ఐరాస డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమినా తెలిపారు. ఇకనైనా మేల్కోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఐరాస ప్రతినిధి హెచ్చరించారు. 

 

Leave a Comment