ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలు..

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కానీ పేదోడికి మాత్రం ఆ తారీఖు గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ధరాభారంతో సతమతమవుతున్న నిరుపేదలకు మళ్లీ అన్ని రూపాల్లో షాక్ తగలనుంది. పాలు, స్మార్ట్ ఫోన్, బ్యాటరీలు, హెడ్ ఫోన్స్, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్, ఫ్యాన్, టీవీ, విమాన టికెట్లు, కార్ల ధరలు, ముడి సిల్క్, నూలు వస్త్రాలు, సింథటిక్ లెథర్, వంట నూనె, ఎల్ఈడీ బల్బులు, సోలార్ ఇన్వర్టర్లు, మొబైల్ ఛార్జర్లలతో పాటు కీలకమైన నిత్యవసర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి.

పాల ధర లీటర్ కు రూ.3 పెరిగే అవకాశం ఉండగా, టీవీ మోడల్ ను బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, ఏసీల ధరలు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏసీలు, ఫ్రిజ్ ల ధరలు పెంచనున్నట్లు అధికారిక సంతేకాలు కూడా ఇచ్చాయి. ఇక సెల్ ఫోన్ ఛార్జర్లు, ఫోన్ పార్ట్స్, అడాప్టర్లు, బ్యాటరీలు, హెడ్ పోన్లపై కనీసం 2.5 శాతం ధరలు పెరగనున్నాయి. స్మార్ట్ ఫోన్ పై కనీసం రూ.1500 నుంచి రూ.3000 వరకు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. 

ధరలు తగ్గేవి..

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ జాబితాలో పసిడి, వెండి ధరలు తగ్గుతాయి. ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల రేట్లు తగ్గనున్నాయి. 

Leave a Comment