స్కూటీపై తిరుగుతూ విద్యార్థులకు పాఠాలు..!

కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు చాలా కాలంగా మూసి ఉన్నాయి. దీంతో విద్యార్థులకు చదువును దగ్గర చేసేందుకు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన స్కూటర్ ను లైబ్రరీగా మార్చి.. గ్రామాలకు తిరుగుతూ చదువు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాకు చెందిన చంద్ర శ్రీవాస్తవ అనే టీచర్ తన స్కూటర్ కు ఓ వైపు గ్రీన్ బోర్డు ఏర్పాటు చేసుకోగా, మరో వైపు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ లతో కూడిన మినీ లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ చెట్టు నీడలో చిన్న మైక్ ఉపయోగించి పిల్లలకు పాఠాలు నేర్పుతున్నాడు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేనివారి కోసం పుస్తకాలు అందిస్తూనే వారికి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు.  

ఇక్కడి గ్రామాల్లో చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారు, స్మార్ట్ పోన్లు కొనలేని వారు ఉండటంతో వారు ఆన్ లైన్ క్లాసులు పొందలేరని ఉపాధ్యాయుడు చంద్ర శ్రీవాస్తవ తెలిపారు. చాలా ప్రాంతాల్లో నెట్ వర్క్ ఉండదన్నారు. దీంతో తన స్కూటర్ కు ఒక వైపు గ్రీన్ బోర్డు, మరో వైపు పుస్తకాలు ఏర్పాటు చేసుకుని స్కూటీపై బోధించడం ప్రారంభిచానని శ్రీవాస్తవ పేర్కొన్నారు. పిల్లలకు క్రమం తప్పకుండా క్లాసులు బోధిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  

  

Leave a Comment