ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు రావు..!

ప్రస్తుతం వర్షాకాల సీజన్.. ఈ సీజన్ లో విషజ్వరాలు ప్రబలుతుంటాయి. మలేరియా, టైఫాయిడ్, డయేరియా, కలరా, వైరల్ జ్వరాలు వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధలతో పాటు డెంగ్యూ కూడా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.. అటు కరోనా మహమ్మారి, ఇటు సీజనల్ వ్యాధులు, డెంగ్యూ ప్రజల్లో వణుకుపుట్టిస్తున్నాయి. అసలు ఏ వ్యాధి సోకిందనే విషయాన్ని తేల్చుకోలేక ప్రజలు సతమతమవుతున్నారు. మహమ్మారి సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ జాగ్రత్తలు పాటించండి:

  • ఈ వర్షాకాలంలో బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. 
  • వాటర్ కూలర్లు, టెర్రస్ పైన నీటి నిల్వలు, ఇతర ట్యాంకుల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. 
  • దోమల నివారణ మందులు వాడాలి. 
  • ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కచ్చితంగా స్నానం చేయాలి. ఇలా చేయడంతో మన శరీరంపై ఉన్న సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. తరుచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. 
  • ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం చేయాలి. ఏం కాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు వద్దు. 
  • శుభ్రమైన ఆహారం, నీళ్లు తీసుకోవాలి. వీటిల్లో నిర్లక్ష్యం చేస్తే అనేక సీజనల్ వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే తినడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. 
  • ఒకవేళ ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ, శుభ్రత పాటించే ప్రాంతాల్లోకి మాత్రమే వెళ్లడం మంచిది..

Leave a Comment