కరోనా కొత్త వేరియంట్ యమ డేంజర్.. టీకాలు కూడా పనిచేయవ్..!

ప్రపంచ మహమ్మారి ప్రపంచాన్నీ గడగడలాడించిన సంగతి తెలిసిందే.. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంద. కొత్తకొత్త వేరియంట్లలో కరోనా రూపాంతరం చెందుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఇప్పటివరకు ఉన్న వైరస్ వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ కు మ్యూటేషన్ రేటు చాలా అధికంగా ఉంది. ఈరకం వేరియంట్ మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. 

దక్షిణాఫ్రికాలో తొలిసారిగా సీ.1.2 రకం కరోనా వేరియంట్ ను గుర్తించారు. ఈ వేరియంట్ వ్యాక్సిన్ నుంచి లభించిన రక్షణను సైతం ఎదిరించి మరీ వ్యాప్తి చెందుతుందని వెల్లడైంది. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ), క్వాజులు-నేటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్ ఫాం(క్రిస్ప్) సంస్థల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 

మ్యుటేషన్లు అధికం:

చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ సీ.1.2 రకం వేరియంట్ బయటపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో కరోనా ఫస్ట్ వేవ్ లో సీ.1 రకం తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో పోలిస్తే సీ.1.2 వేరియంట్ అధికంగా వ్యాపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో మ్యూటేషన్లు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. సీ.1.2 మ్యుటేషన్ రేటు 41.8 శాతం ఉందని, అంటే ఏడాదికి 41.8 సార్లు వైరస్ లో మార్పులు సంభవిస్తాయని తెలిపారు. 

Leave a Comment