ఆన్ లైన్ క్లాసుల పేరుతో.. నగ్న వీడియోలు తీసుకన్న బాలిక.. మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి..!

కరోనా విలయం జీవన శైలిలోనూ మార్పులు తీసుకొచ్చింది. క్లాస్ రూం పాఠాల నుంచి ఆన్ లైన్ పాఠాల వరకు తెచ్చింది. అయితే ఆన్ లైన్ అవసరత పెరుగుతున్న కొద్దీ అశ్లీలత కూడా సులువుగా అరచేతుల్లోకి వచ్చేసింది. ప్రధానంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్ వాడటం తప్పనిసరి అయింది. దాని తాలూకు దురాగతాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పనులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నాయి. 

తాజాగా ఓ అమ్మాయి నగ్న వీడియోలు తీసుకుని ఓ వెబ్ సైట్ లో పోస్టు చేసింది. ఇది చూసిన అమ్మాయి తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ కు చెందిన 15 ఏళ్ల బాలికకు ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ప్రత్యేక గదిలో ఆన్ లైన్ పాఠాలు వింటుంది. 

ఆ సమయంలో ఆ బాలిక స్క్రీన్ పై ఓ వెబ్ సైట్ కనిపించింది. ఆ వెబ్ సైట్ ను తెరిచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. ఆ బాలిక గదిలో ఒంటిరిగా ఉంటూ వాటిని చూడటం ప్రారంభించింది. అంతేకాదు ఆ వీడియో, చిత్రాలకు కామెంట్లు కూడా చేసింది. ఈక్రమంలో ఆమెకు ఆన్ లైన్ లో కొందరు పరిచయమయ్యారు. వారి బాలికను నీ నగ్న వీడియో కూడా పెట్టు అని బలవంతం చేశారు. ఇక తరుచూ అడుగుతుండటంతో ఒకరోజు బాలిన తన నగ్న వీడియో, ఫొటోలు తీసి ఆ వెబ్ సైట్ లో పోస్టు చేసింది. 

ఆ బాలిక పోస్టు చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఆ బాలిక తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్ సైట్ గురించి చెప్పింది. మీరు కూడా ఈ వెబ్ సైట్ ను ఫాలో కావాలని, ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవాలని చెప్పింది. ఈ విషయాన్ని వారు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు పిల్లలకు చీవాట్లు పెట్టి ఆ బాలిక తల్లదండ్రుల వద్దకు వచ్చారు. తమ కుమార్తె నగ్న వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బంధువులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై 181కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా బాలికు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తొలగించేశారు. ఆ వెబ్ సైట్ గురించి ఆరా తీస్తున్నారు. పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వింటున్నప్పుడు తల్లిదండ్రులు వారిపై ఓ కన్నేసి ఉంచండి.. వారికిచ్చిన స్మార్ట్ ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీని చెక్ చేస్తూ ఉండండి..  

Leave a Comment