సర్కారి బడుల్లో LKG, UKG విద్య..

రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ విద్యను అమలు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ ఎడ్యూకేషన్..ఎల్ కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 

రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్ కేజీ, యూకేజీ బోధనలు సాగుతున్నాయన్నారు. వాటిలో 11,657 అంగన్వాడీ కేంద్రాలు పలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, భవనాలకు అనుకుని ఉన్నాయన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రాలను ఆయా ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కలిసి విద్యా బోధన సాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ప్రీ ప్రైమరీ ఎడ్యూకేషన్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారన్నారు.

Leave a Comment