హీరో విజయ్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయ చర్చలు సాగించారు. ఈ భేటీ జరిగి కొన్ని రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.. ఇటీవల ముగిసిన మున్సిపల్, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం తరఫున పోటీచేసి గెలిచిన అభ్యర్థులను విజయ్ ఇంటికి పిలిపించుకుని చర్చించారు. ఈ తరుణంలో విజయ్ మనసులో క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశలు చిగురించాయి. 

ఇదిలా ఉంటే విజయ్ రాజకీయ ఎంట్రీపై తమిళ సినీ పరిశ్రమలోని వారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. పార్టీ స్థాపనలో విజయ్ మరో రజనీకాంత్ లా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. 100 శాతం విజయం సాధిస్తామని నమ్మకం ఉంటేనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అంటున్నారు. లేదంటే ఈ ప్రచారాలను సినిమా కోసం వాడుకోవచ్చని విజయ్ భావించే అవకాశం ఉందని, ఇందులో భాగంగానే ఈ భేటీ అని చమత్కరిస్తున్నారు.  

 

Leave a Comment