సొంత OS రూపొందించే యోచనలో భారత్..!

మనకు తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్స్.. ఒకటి గూగుల్ కి చెందిన ఆండ్రాయిడ్, యాపిల్ కి చెందిన ఐఓఎస్..మొబైల్ ఫోన్లలో ఇవే ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. కంప్యూటర్ లో అయితే మైక్రోసాఫ్ట్.. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా ఓ స్వదేశీ OS రూపొందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ని రూపొందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం పార్లెమంట్ లో వెల్లడించింది. 

లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మెరుగైన డిజైన్, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దేశీయంగా సొంత ఓఎస్ ని రూపొందించాలని అనుకుంటోందని మంత్రి చెప్పారు. 

మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని తెలిపారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని కేవలం ఇండియాకే పరిమితం చేయాలని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నలకు.. సాఫ్ట్ వేర్ ఎగుమతి, భారత్ వెలుపలి వినియోగంపై నిషేధం విధించడం గురించి ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని మంత్రి వెల్లడించారు.  

Leave a Comment