పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి : ప్రకాశ్ రాజ్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాలు వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ నేతలు వస్తున్నారని, వీళ్లకు హిందూ-ముస్లిం గొడవలు తప్ప అభివృద్ధి గురించి పట్టదని విమర్శించారు. ప్రజలంతా టీఆర్ఎస్ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బీజేపీ..కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించాలని కోరారు. 

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుని బీజేపీకి మద్దుతు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. పవన్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తననూ నిరుత్సాహానికి గురిచేసిందన్నారు. పవన్ కళ్యాణ్ కు ఏమైందో తనకు అర్థం కావడం లేదన్నారు. ‘మీరు ఒక లీడర్. ఇంకో పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? 2014లో ఎన్డీఏతో పొత్తుపెట్టుకుని మోడీని పొగిడారు. 2019లో లెఫ్ట్ పార్టీలతో జతకట్టి మోడీని తిట్టారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి’ అంటూ ప్రకాశ్ రాజ్ విమర్శించారు. 

Leave a Comment