రేపు హైదరాబాద్ కు యోగీ..పాతబస్తీలో రోడ్ షో..!

జీఎచ్ఎంసీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దుబ్బాక విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ, గ్రేటర్ ఎన్నికల్లో సత్తాచాటాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్ర నేతలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. 

ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా శనివారం హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత మల్కాజ్ గిరి, పాతబస్తీలో రోడ్ షో నిర్వహించనున్నట్లు సమచారం. మధ్యాహ్నం 3 గంటలకు జీడిమెట్ల ఉషా ముళ్లపూడి ఆస్పత్రి నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రోడ్ షో ఉండనుంది. సాయంత్రం 6 గంటలకు పాతబస్తీలోని శాలిబండ, లాల్ దర్వాజలో పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొనున్నారు.    

Leave a Comment