ఇదేందయ్య ఇది.. పెళ్లి కూతురుగా మారిన పెళ్లి కొడుకు..!

ఇదేందయ్య ఇది.. పెళ్లి మండపంలో వధువు మెడలో తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు ఇలా మారిపోయాడు..చీర కట్టుకొని పెళ్లి కుమార్తుగా దర్శనమిచ్చాడు..  ఇలా ఎందుకు మారిపోయాడంటే.. వారి వంశాచారం ప్రకారం పెళ్లికి ముందు దేవుడికి ఎదురు నడిచే తతంగం ఉందట.. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్రబాబుకు ఆదివారం రాత్రి పెళ్లి జరిగింది.. 

వారి వంశాచారం ప్రకారం యోగేంద్ర చీర, జాకెట్ ధరించి విగ్గు పెట్టికొని, తల నిండా పూలు పెట్టుకున్నాడు. బొట్టు, కాటుక, గాజులు, దండలతో అచ్చం పెళ్లి కుమార్తెలా తయారయ్యాడు. తమ ఇలవేల్పు అయిన గురప్పడు స్వామికి కొలుపులు జరిపేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మేళతాళాలు, బొల్లావుతో ఉత్సవం చేసుకుంటూ ఎదురైన ముత్తయిదువులకు నుదుట బొట్టు పెట్టుకుంటూ వారి ఆశీర్వచనాలు అందుకున్నాడు. 

ఆ తర్వాత ఊరి చివర ఉన్న జమ్మి చెట్టు దగ్గకు వెళ్లి పూజలు చేశారు. అక్కడ నైవేద్యాలు సమర్పించారు. ఇది తమ వంశాచారమని నాలి రామయ్య తెలిపారు. పెళ్లికి ముందు పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెగా.. పెళ్లి కుతూరును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి పూజలు చేస్తామన్నారు. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారమని రామయ్య చెప్పారు. 

Leave a Comment