‘ఇంతకు నేను రాజకీయాల్లో ఉండాలా..వదిలేయాలా’..ఆసక్తిగా ‘పవర్ స్టార్’ ట్రైలర్..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘పవర్ స్టార్ -ఎన్నికల ఫలితాల తర్వాత కథ‘ అనే టైటిల్ తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ముందుగా ఈ ట్రైలర్ చూసేందుకు వర్మ రూ.25 ఛార్జ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

కానీ సినిమా ట్రైలర్ లీకైనట్లు వర్మ వెల్లడించాడు. దీనికి వెనుక తన ఆఫీస్ స్టాఫ్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. దీంతో ఈ ట్రైలర్ ను యూట్యూబ్ లో హైరిజల్యూషన్ వర్షన్ లో వర్మ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు పెంచేసేలా ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యంగా సినిమా తీసినట్లు అర్థమవుతుంది.

 ‘ మీకు ఓ దండం..ఇక మీద మిమ్మల్ని నమ్మను’ అంటూ చంద్రబాబును పోలిన వ్యక్తితో చెప్పడం చూస్తే..పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు మధ్య ఏం జరిగిందనే ఆసక్తిని కలగజేస్తుంది..‘ ఇంతకు నేను రాజకీయాల్లో ఉండాలా…వదిలేయాలా’ అన్న మాటలు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయంపై చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమా చూడాలన్నా ఆసక్తిని కలుగజేస్తుందనడంలో సందేహం లేదు..

Leave a Comment