కరోనా వ్యాక్సిన్ వాడకానికి సిద్ధం..!

కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందున్న రష్యా ఇటీవల హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్ చేసింది. తాజాగా రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకాన్ని వచ్చే నెలలోనే సిద్ధం చేస్తున్నట్లు ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రష్యా కనుగొన్న వ్యాక్సిన్ కు సంబంధించి మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది.
రెండో దశ పరీక్షలు సోమవారం ముగిశాయి. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారి రోగనిరోధక శక్తి పెంపొందించుకుంటుంది. వీరు త్వరగా కోలుకుంటున్నారు కూడా. త్వరలోనే వేలాది మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతుంది. అయితే ఎప్పుడనేది స్పష్టంగా ప్రస్తావించలేదు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం సాలికోవ్ వాదనను అధికారికంగా ధ్రువీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Leave a Comment