‘ఇంటికే నాణ్యమైన బియ్యం’ జనవరిలో లేనట్లే..!

జనవరి ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విధానం వాయిదా పడింది. జనవరిలో పాత పద్ధతిలోనే రేషన్ సరకులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి రేషన్ బియ్యం డోర్ డెలివరీ విధానాన్ని మొదలు పెడతామని చెబుతున్నారు. 

కాగా, జనవరి నుంచి బియ్యం డోర్ డెలివరీ చేయాలని అధికారులు అన్ని సిద్ధం చేశారు. అయితే మినీ ట్రక్కుల పంపిణీ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇంటికే రేషన్ సరకులు కార్యక్రమం వాయిదా పడింది. దీంతో సాధ్యమైనంత త్వరగా సరుకులను రేషన్ షాపులకు తరలించి జనవరి 4 నుంచి పంపిణీ చేయాలలని అధికారులు ఆదేశించారు. 

Leave a Comment