#PKLOVE హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్..! 

ఇటీవల ఓ పంజాబీ అమ్మాయి గురించి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా, సినిమా పరంగా హాట్ గా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.. ఆ పంజాబీ అమ్మాయే పూనమ్ కౌర్.. తెలుగు కొన్ని సినిమాలే చేసిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల పూనమ్ కౌర్ కు పవన్ కళ్యాణ్ కు లింక్ చేసి ఆరోపణలు వచ్చాయి. ఆమెకు కడుపు చేసి అబార్షన్ చేయించారని, అందుకోసం రూ.5 కోట్లు ఇచ్చారని సినీ నటుడు పోసాని, మరి కొందరు వైసీపీ నేతలు ఆరపించారు.. ఈ విషయం ఎంత దుమారం రేపిందో తెలిసిందే..

తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. #PKLOVE అనే హ్యాష్ టాగ్ తో ఆమె తన ఫొటోలను షేర్ చేసింది. అభిమానులు కాని, సోషల్ మీడియాలో కాని  పవన్ కళ్యాణ్ ను షార్ట్ ఫామ్ లో PK అని సంబోదిస్తుంటారు. దీంతో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఎలాంటి వివరణ ఇవ్వకుండా PKLOVE అంటూ పెట్టడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి. అయితే పూనమ్ కౌర్ అంటే కూడా షార్ట్ ఫామ్ లో PKనే.. అయితే పోస్టులో ఆమె ఫొటోలను షేర్ చేసింది. కాబట్టి తన పేరుతోనే ఆ హ్యాష్ ట్యాగ్ వాడి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే పూనమ్ ఏ ఉద్దేశంతో ఆ హ్యాష్ ట్యాగ్ వాడిందో ఆమె చెబితే కాని స్పష్టత రాదు. 

Leave a Comment