ఏపీలో దేనికి పనికి రాని వ్యక్తితో ఇక్కడ రాజకీయం.. పవన్ కళ్యాణ్ పై సెటైర్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేని, ఏపీలో దేనికి పనికి రాని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తితో హైదరాబాద్ లో రాజకీయాలు ఏంటో వాళ్లకే తెలియాలని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. 

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో 50 శాతానికి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారని, ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీ షోలా అనిపిస్తున్నాయని చెప్పారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ హోదాలో హుందాగా ఉండాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకొని దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని సవాల్ విసిరారు..

Leave a Comment