అమానుషం : దళితులకు హెయిక్ కట్ చేసినందుకు సంఘ బహిష్కరణ..!

కర్నాటక రాష్ట్రంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. దళితులకు హెయిర్ కట్ చేసినందుకు ఒక బార్బర్ షాప్ యజమాని కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేశారు. ఈ ఘటన మైసూరు జిల్లాలోని సంజనాగుడు తాలుకాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు హల్లారే గ్రామానికి చెందిన మల్లికార్జున శెట్టి కుటుంబం కటింగ్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. 

అయితే వారు తమ షాపులో ఎస్సీ, ఎస్టీలకు హెయిర్ కట్ చేశారంటూ కొందరు అగ్రవర్ణాల వారు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. రూ.50 వేలు జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించారు. ఈ ఘటనపై మల్లికార్జున అధికారులకు ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నాడు. గతంలో కూడా కులవివక్షకు గురై జరిమాన చెల్లించినట్లు బార్బర్ మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

Leave a Comment