ప్రేమించి పెళ్లి చేసున్నారు.. ఇప్పుడు విడాకులు కోరుతున్నారు..!

ప్రస్తుతం ఓ విడాకుల వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఐఏఎస్ టాపర్లు అథర్ అమిర్ ఉల్ షఫీ ఖాన్, టీనా దాబిలు ఇప్పుడు కోరుతున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ పై పెద్ద ఎత్తున చర్చజరుగుతున్న తరుణంలో వీరు విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారంది.
2015 సివిల్ సర్వీస్ పరీక్షలో భోపాల్ కు చెందిన టీనా దాబి మొదటి ర్యాంక్ సాధించగా, కశ్మీర్ కు చెందిన అథర్ అమీర్ రెండో ర్యాంక్ సాధించారు. సివిల్స్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 2018లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ ప్రేమ పెళ్లి సంచలనం సృష్టించింది.  

టీనా ఐఏఎస్ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వహిందూ మహాసభ బహిరంగంగానే విమర్శించింది. అయినా వాటిని లెక్కచేయకుండా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పోస్టింగ్ అనంరతం ఇద్దరూ రాజస్తాన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే పెళ్లయిన కొంత కాలానికే ఇద్దరి మధ్య అభిప్రాయ విభేదాలు రావడం ప్రారంభమయ్యాయి.

ఇరు కుటుంబాల పెద్దలు గొడవలను గమనించారు. ఇద్దరు ఉన్నత ఉద్యోగులే కదా సర్దుకుపోతారు అనుకున్నారు. కాని వారిద్దరి మధ్య మనస్పర్థలు ఎక్కువ అయ్యాయి. దీంతో అమీర్ జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. తామిద్దరి అంగీకారం మేరకే పిటిషన్ ఫైల్ చేసినట్లు తెలిపారు. అయితే అందరిని ఎదిరించి వివాహం చేసుకున్న ఈ ప్రేమ జంట ఇప్పుడు విడాకుల పేరుతో దేశంలో హాట్ టాపిక్ గా నిలిచారు.   

 

Leave a Comment