ఈ పోలీస్ చేసిన పనికి అందరూ ఫిదా.. మంత్రాలు చదువుతూ హెల్మెట్ పెట్టాడు..!

సాధారణంగా బైక్ పై హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు ఏం చేస్తారు? ఫైన్ వేసి వదిలేస్తుంటారు. ఒక్కోసారి వాహనాలు జప్తు చేస్తుంటారు. కానీ ఓ పోలీస్ అధికారి చేసిన పనికి మాత్రం అందరూ ఫిదా అవుతున్నారు. హెల్మెట్ లేకుండా భార్యతో కలిసి బైక్ మీద వెళ్తున్న ఓ వాహనదారుడి విషయంలో పోలీసుల అధికారి వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకు ఆయన ఏం చేశారంటే.. 

ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ పై అతని భార్యతో కలిసి వెళ్తుంటాడు. అతడిని ఓ పోలీస్ అధికారి ఆపుతాడు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని అడుగుతాడు. వాహనదారుడు ఏదో సమాధానం చెబుతాడు. అతని మాటలు విన్న ఆ పోలీస్ అధికారి కొద్ది సేపటి తర్వాత ఓ హెల్మెట్ తెప్పిస్తాడు. ఆ హెల్మెట్ ని సదరు వాహనదారుడికి ఇస్తాడు. అంతేకాదు.. ఆ హెల్మెట్ ని వాహనదారుడికి పెడుతూ కొన్ని మంత్రాలు చదువుతాడు. 

ఆ మంత్రాల్లో ట్రాఫిక్ రూల్స్ ఆవశ్యకతను వివరిస్తాడు. చివరికి హెల్మెట్ తప్పకుండా ధరించాలని చేతులు జోడించి వేడుకుంటాడు. మరోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రస్తుతం ఉన్న మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ జరిమానా విధిస్తామని హెచ్చరించి అతడిని వదిలేస్తాడు. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ నడపనని వాహనదారుడు హామీ ఇస్తాడు. 

దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేేశాడు. ‘ఈ సోదరుడు తన పెళ్లిలో ఇంత గౌరవంగా దుస్తులు కూడా ధరించి ఉండడు’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సదరు పోలీస్ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Leave a Comment