జాన్సన్ బేబీ పౌడర్ తో ఇన్ఫెక్షన్లు.. నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం..!

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ గురించి తెలియని వారుండరు.. చాలా మంది తమ పిల్లలకు ఈ పౌడర్ ఉపయోగిస్తారు.. అమెరికన్ ఫార్మా కంపెనీ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ చాలా కాలంగా భారతీయ మార్కెట్ లో బాగా ప్రాచుర్యంలో ఉంది. అయితే కొంతకాలంగా జాన్సన్ బేబీ పౌడర్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పౌడర్ తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. 

ఈనేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాన్సన్ బేబీ పౌడర్ పై నిషేధం విధించింది. ఈ పౌడర్ తో ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. జాన్సన్ బేబీ పౌడర్ వాడితే చర్మంపై ఇన్ఫెక్షన్ వస్తుందని వెల్లడించింది. జాన్సన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్్ ను మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) రద్దు చేసింది. ఈ పౌడర్ యొక్క నమూనాలు ప్రామాణిక నాణ్యతకు అనుగుణంగా లేవని స్పష్టం చేసింది. జాన్సన్ బేబీ పౌడర్ వాడకం వల్ల అప్పుడే పుట్టిన శిశువుల చర్మానికి హానీ కలుగుతుందని ఎఫ్డీఐ పేర్కొంది. 

గతంలోనూ జాన్సన్ బేబీ పౌడర్ పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ పౌడర్ కారణంగా వ్యాపిస్తుందని కొందరు ఫిర్యాదు చేశారు. ఈ పౌడర్ లోని ఆస్ బెస్టాస్ అవశేషాలు క్యాన్సర్ కు దారితీస్తున్నట్లు కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించారు. బాధితులకు సానుకూలంగా కోర్టులు తీర్పులిచ్చాయి. దీంతో జాన్సన్ కంపెనీ బాధితులకు 22 మంది మహిళలకు 2 బిలియన్ డాలర్లకుపైగా పరిహారం కూడా చెల్లించింది. అమెరికా 2020లోనే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ని నిషేధించింది. 

ఈ పరిణామాలతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా గత నెలల ప్రపంచ వ్యాప్తంగా బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. 2023 నాటికి టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ విక్రయాలను నిపివేస్తామని ప్రకటించింది. కార్న్ స్టార్చ్ ఆధారిత బేబీ పౌండర్ పోర్ట్ ఫోలియోకు మారబోతున్నట్లు జాన్సన్ వెల్లడించింది. ఇక జాన్సన్ బేబీ పౌడర్ ను 1894 నుంచి విక్రయిస్తున్నారు. 1999లో బేబీ ఉత్పత్తుల విభాగంలో టాప్ గా నిలిచింది.. 

Leave a Comment