యూనివర్సిటీలో దారుణం.. 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియో లీక్..!

పంజాబ్ లోని ఓ యూనివర్సిటీలో దారుణం జరిగింది. విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియో లీక్ అయ్యింది. దీంతో యూనివర్సిటీలో ఆందోళన చెలరేగింది. యూనివర్సిటీ హాస్టల్ లోనే ఉంటున్న ఓ యువతి ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలిసింది. దీంతో కొంత మంది యువతులు ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో విద్యార్థినులు నిరసనకు దిగారు. 

యూనివర్సిటీ హాస్టల్ లో తోటి విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియోలను తీసిన ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ కి పంపింది. మొత్తం 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను అతడు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలు పోర్న్ సైట్ లో కనిపించడంతో యూనివర్సిటీ విద్యార్థినులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమాన భారంతో 8 మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు వస్తున్న వార్తలను పోలీసులు, యూనివర్సిటీ పరిపాలనా విభాగం ఖండించింది. పుకార్లు నమ్మవదంటూ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులంతా ప్రశాంతంగా ఉండాలని కోరారు. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 

 

Leave a Comment