హాట్ఫాఫ్ ఇండియన్ ఆర్మీ.. నైనిటాల్ లో ప్రజలను ఎలా రక్షించారో చూడండి.. వీడియో వైరల్..!

బోర్డర్ వద్ద రాత్రి పగలూ పహారా కాయడమే కాదు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తామున్నామంటూ అండగా నిలబడుతుంది ఇండియన్ ఆర్మీ.. తాజాగా ఉత్తరాఖండ్ లో వరదలు సంభవించి రాష్టం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు నైనిటాల్ లో వరదల్లో చిక్కుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. 

ఈక్రమంలో ఇండియన్ ఆర్మీ బృందం అక్కడికి చేరుకుంది. వరదల్లో చిక్కుకున్న వారికి అండగా నిలిచింది. భారీ వర్షం కారణంగా ఓ షాపులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఆర్మీ సిబ్బంది చేతులు కలిపారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని కాపాడారు. ఈ ఆపరేషన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వీడియోలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఆర్మీ సిబ్బంది చేయి చేయి కలిపి వారిని తమ భూజాల మీదకు తీసుకుని ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ వారిని రక్షించేందుకు ప్రయత్సిస్తోంది. వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. 

24 గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడి మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించాయి. ఈ వర్షాలకు 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. నైనిటాల్ జిల్లాలోని రామ్ గఢ్ ప్రాంతంలో క్లౌడ్ బర్ట్స్ సంభవించింది. దీంతో నాయిని సరస్సు పొంగి రోడ్డు, కాఫీ షాపులు, సమీప ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తుతున్నాయి.   

 

Leave a Comment