హీరో సూర్యపై దాడి చేస్తే.. రూ.లక్ష బహుమతి..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించి, నిర్మించిన ‘జై భీమ్’ సినిమా ఎంత భారీ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమంటూ మెచ్చుకుంటున్నారు.. ఓటీటీలో విడుదలై రికార్డు స్థాయి వ్యూస్ ని సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘జై భీమ్’.. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు నెలకొల్పుతోంది. ఐఎండీబీలో 9.6 రేటింగ్ సాధించి ప్రపంచ స్థాయి రికార్డును సృష్టించింది.

మరో వైపు ఈ సినిమాను వివాదాలు సైతం వెంటాడుతున్నాయి. ‘జై భీమ్’ మూవీలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకుల్లో ఒక వర్గం ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేసింది. మూవీ మేకర్స్ ఆ సన్నివేశాన్ని మార్చినప్పటికీ క్యాలెండర్ వివాదం సద్దుమణగలేదు. ఇప్పుడ ఈ వివాదం మరింత ముదిరింది. కుల వర్గాలను రెచ్చగొట్టి, అల్లర్లను సృష్టిస్తున సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం ఇచ్చారు.  

అంతేకాదు వన్నియార్ కమ్యూనిటీని కించపరిచన నటుడు సూర్యను కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయలు ఇస్తామని పీఎంకే నేతలు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆదివారం మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు. రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని జైభీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘ: నోటీసు జారీ చేసింది.

మరో వైపు పలువురు ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. సూర్య అభిమానులకే కాదు, పలువురు సినీ అభిమానులు కూడా సూర్యకు మద్దతు తెలుపుతున్నారు. సూర్యపై దాడి చేస్తామని బమాగా జిల్లా యంత్రాంగం చేసిన బెదిరింపులకు వ్యతిరేకంగా పలువురు ట్వీట్లు చేస్తున్నారు.      

Leave a Comment