విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.1.25 లక్షల స్కాలర్ షిప్..!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ లు ప్రకటించింది. యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా(PM YASASVI Scheme) స్కీమ్ లో భాగంగా స్కాలర్ షిన్ అందించేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈస్కీమ్ లో 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న ఇతర వెనుకబడిన తరగతి(OBC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి(EBC), డి-నోటిఫైడ్, సంచార, సెమీ-సంచారా(DNT) కేటగిరీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు స్కాలర్ షిప్ ను అందిస్తారు.. మెరిట్ ఆధారంగా విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేయబడతారు.. 

అర్హతలు:

విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించకూడదు..

దరఖాస్తు చేసే ప్రక్రియ:

  • విద్యార్థులు మొదట అధికారిక వెబ్ సైట్ yet.nta.ac.in సందర్శించాలి. 
  • వెబ్ సైట్ లో అందించిన రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం పేరు, ఈ-మెయిల్, పుట్టిన తేదీ, పాస్ వర్డ్ ని సమర్పించి అకౌంట్ ఓపెన్ చేయాలి.
  • ఇప్పుడు లాగిన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 
  • అనంతరం దరఖాస్తు ఫారమ్ ని సమర్పించి.. ప్రింట్ తీసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27-07-2022

దరఖాస్తులకు చివరి తేదీ : 26-08-2022

కరెక్షన్ విండో : ఆగస్టు 27 నుంచి 31 వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. 

పరీక్ష తేదీ:11-09-2022

కావాల్సిన పత్రాలు:

  • ఆధార్ నెంబర్
  • ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం

 

 

 

 

 

 

 

Leave a Comment