మంకీపాక్స్ తో కేరళ యువకుడు మృతి..!

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.. ఇప్పటికే 75 దేశాలకు విస్తరించింది. భారతదేశంలోనూ మంకీపాక్స్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది.. దేశంలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం మరణించాడు.. 

అయితే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా విరస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్ పై నిఘా పట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడమే కాక.. దీని నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ దిశా నిర్దేశం చేయనుంది. అలాటే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై సూచనలు ఇవ్వనుంది. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ దీనిని నేతృత్వం వహించనున్నారు. 

Leave a Comment