ఏవండోయ్ ఇది విన్నారా.. పరీక్షలో 100కు 151 మార్కులు వచ్చాయి..!

పరీక్షల్లో 100 మార్కులు ఎన్ని మార్కులు వస్తాయి?.. ఎంతో కష్టపడి చదివితే.. 99 మార్కులు తెచ్చుకోవచ్చు.. లేదా 100 మార్కులు సాధించవచ్చు.. అంతకు మించి మార్కులు రావు.. కానీ.. బిహార్ కి చెందిన ఓ డిగ్రీ విద్యార్థికి 100కు 151 మార్కులు వచ్చాయి.. ఏంటీ షాక్ అవుతున్నారా.. ఆ విద్యార్థి కూడా తన మార్కులు చూసి అలాగే షాక్ అయ్యాడు.. 

దర్బంగా జిల్లాకు చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ సెకండియర్ చదువుతున్నాడు..ఇటీవల నిర్వహించిన పొలిటికల్ సైన్స్ పరీక్షలో ఆ విద్యార్థికి 100కు 151 మార్కులు వచ్చాయి.. రిజల్ట్స్ చూసి ఆ విద్యార్థి షాక్ అయ్యాడు.. తనకు అన్ని మార్కులు ఎలా వచ్చాయో ఆశ్చర్యపోయాడు.. బీకామ్ చదువుతున్న మరో విద్యార్థికి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ పేపర్ లో సున్నా మార్కులు వచ్చాయి.. అయితే టైపింగ్ మిస్టేక్ కారణంగానే ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని, వాటిని సరి చేసి కొత్త సర్టిఫికెట్లు జారీ చేశామని యూనివర్సిటీ వివరణ ఇచ్చింది.. 

 

Leave a Comment