ఏడాది పాలనపై ప్రజలకు మోడీ లేఖ

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండో సారీ అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలో ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖారాలకు తీసుకెళ్తూ ప్రపంచ నాయకుడిగా మోడీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోడీ తన ఖాతాలో వేసుకున్నారు. 

వివాదాస్పద ట్రిపుల తలాక్ బిల్లు పౌరసత్వ చట్ట సవరణ, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. రెండో సారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా..దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ ఒక లేఖ రాశారు. లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. 

‘నా దేశ పౌరులారా, గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తి కాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహకారం కొత్త శక్తిని స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించడం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా’ అంటూ మోడీ తెలిపారు. 

Leave a Comment