రైతులకు అడుగడుగునా తోడుంటాం : సీఎం జగన్

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చామని సీఎం జగన్ స్పష్టం చేశారు. శనివారం సీఎం జగన్ క్యాంపు కార్యాయలంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. మొత్తం 10641 రైతు భరోసా కేంద్రాలను, ఆర్ బీకేలలో ఉండే కియోస్క్ లను ప్రారంభించారు. అలాగే రైతుల సమస్య పరిష్కారానికి ఉద్దేశించి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 155251 ను మొదలుపెట్టారు. మార్కెట్‌ ఇంటలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన సీఎం–యాప్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతుల కోసం పని చేసే పార్టీ వైసీపీ అని అభివర్ణించారు. రైతు బాగుంటేనే, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని చెప్పారు. రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు 49 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. రైతులకు అడుగడుగునా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

నో దళారి. నో వివక్ష:

గత ప్రభుత్వం హయాంలో ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వాల్సి వచ్చేది. మన ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని సీఎం జగన్ స్పష్టం చేశారు. మీ ఇంటి ముందే గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయని, వాటి డెడ్ లైన్ పెట్టి మరీ 540 రకాల సేవలు అందిస్తున్నామని అన్నారు. ఇక నుంచి దశారి వ్యవస్థ, లంచం, వివక్ష ఉండవని సీఎం జగన్ స్పష్టం చేశారు. అసలు ఏ పథకం వచ్చిందో గతంలో తెలిసేది కాదని, దరఖాస్తు వివరాలు కూడా తెలిసేవి కావని చెప్పారు. కానీ ఇప్పుడు ఎలాంటి దాపరికాలు లేవని, అంతా పారదర్శక పాలన సాగుతుందని అన్నారు. 

 

Leave a Comment