అతిగా ఆహారం తినే అలవాటును మానడం ఎలా?

ఆహారం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మన శరీరం ఇక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడా ఆహారం లేకపోతే పని చేయదు. మనం తినే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఆరోగ్యం..ఎక్కువగా తీసుకుంటే విషం..అని అన్నారు పెద్దలు. 

ఈ ఆధునిక కాలంలో ఆహారం తినడంలో చాలా తేడాలు వచ్చాయి. ఆహారాన్ని అతిగా తినడం ప్రధాన సమస్యగా మారింది. సామాన్యంగా మనం రోజు తీసుకునే ఆహారం కంటే వివాహాలు, సెలవు దినాల్లో ఎక్కువగా లాగించేస్తూ ఉంటాం. కొందరైతే వారి సామర్థ్యానికి మించి తింటారు. జీర్ణక్రియ ప్రక్రియ మనం తినే ఆహారం నుంచి విటమిన్లు మరియు పోషకాలను సేకరించేందుకు మన శరీరం నుంచి గణనీయమైన శక్తిని తీసుకుంటుంది. 

మనం అతిగా తినేటప్పుడు మన జీర్ణవ్యవస్థ ప్రతిదీ ప్రాసెస్ చేయదు. మరియు అదనపు ఆహారం విషంగా మారుతుంది. ఈ టాక్సిన్స్ ను మన శరీరంలోని వివిధ వ్యాధులకు కారణమవుతుంది. 

అయితే మీరు అతిగా తినకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులను ప్రయత్నిస్తుంటారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసిన దీనిని నియంత్రించలేకపోతున్నారా. అయితే కింది పద్ధతుల ద్వారా మీరు అతిగా తినడాన్ని నియంత్రించుకోవచ్చు. 

పాటించాల్సిన నియమాలు..

  • ఎక్కువగా నీరు తాగండి..అతిగా తినే అలవాటును మానుకోవాలంటే మీరు రోజంతా ఎక్కవ నీరు తాగాలి. ఇది మీకు మళ్లీ మళ్లీ ఆకలిని కలిగించదు. 
  • నెమ్మదిగా తినాలి. 
  • మీకు ఆకలి ఉన్నప్పుడే తనండి. ఏదో తినే టైం అయింది కదా అని తినేయకండి. 
  • తినేటప్పుడు ఫోన్, ల్యాప్ టాప్ లేదా టీవీ చూడటం మానేయండి. మనం పరధ్యానంలో ఉన్నప్పుడు ఎక్కవగా తినేస్తాం. 
  • భోజనానికి, భోజనానికి మధ్య 5 నుంచి 6 గంటల వ్యవధి ఉండాలి.
  • ప్రతి భోజనం తర్వాత ఏదో తీపి తినండి. 

 

Leave a Comment