ఆన్ లైన్ క్లాస్ లో విద్యార్థులను చివరిసారిగా చూస్తూ కన్నుమూసిన టీచర్..!

కేరళలో ఓ టీచర్ చివరి క్షణాల్లో చేసిన పని అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. మనల్ని చావు చేరువవుతోందని ముందే తెలుస్తుందా? చివరి క్షణాల్లో మనకు ఏం జరగబోతోందో తెలుస్తుందా? ఆ టీచర్ కి మాత్రం ముందే తెలిసింది. తాను చనిపోతున్నట్లు గ్రహించి ఆన్ లైన్ క్లాసులో కెమెరా ఆన్ చేయాలని విద్యార్థులకు చెప్పింది. తన విద్యార్థులందరినీ కళ్లార చూసుకుని కన్నుముసింది. 

వివరాల మేరకు కేరళలోని కేసర్ ఘడ్ లో మ్యాథ్స్ టీచర్ మాధవి(47) పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నారు. క్లాస్ చెప్పేటప్పుడు ఆమెకు అకస్మాత్తుగా అసౌకర్యంగా అనిపించింది. ఆయాసం, దగ్గు మొదలయ్యాయి. ఆ తర్వాత విద్యార్థులకు హోంవర్క్ కేటాయించి క్లాస్ డిస్ కనెక్ట్ చేసింది. 

ఆ తర్వాత ఆయాసం ఎక్కువ కావడంతో పిల్లలందరినీ కెమెరాలు ఆన్ చేయాలని సూచించింది. ‘దయచేసి వీడియో ఆన్ చేయండి.. నేను అందరినీ చూడాలనుకుంటున్నాను’ అని టీచర్ తన విద్యార్థులకు చివరిసారిగా మాట్లాడుతూ కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మాధవి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ టీచర్ మృతి చెందడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Leave a Comment