ప్లాస్టిక్ బిడ్డకి జన్మనిచ్చిన మహిళ.. మన ఇండియాలోనే..!

ఎన్ని రకాల జన్యుపరమైన సమస్యలతో పుట్టిన శిశులు గురించి ఇప్పటి వరకు విని ఉంటారు. కానీ ప్లాస్టిక్ బిడ్డ జననం గురించ విని ఉండరు..కానీ అందరినీ ఆశ్యర్యపరిచే ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ నిజంగానే ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చింది. 

వివరాల మేరకు.. ఓరంగబాద్ లోని సోహ్దాకు చెందిన ఓ మహిళ సదర్ ఆస్పత్రిలో ఓ వింత శిశుకు జన్మనిచ్చింది. ఆ శిశువు శరీరం మొత్తం ప్లాస్టిక్ తో చుట్టి ఉంది. వైద్య పరిభాషలో ప్లాస్టిక్ తో పుట్టిన పిల్లలను కొల్లాయిడ్ బేబీస్ అని అంటారని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచంలో 11 లక్షల మంది శిశుల్లో ఒక కొల్లాయిడ్ బేబీ పుడుతుందని సదర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

ఈ చిన్నారి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని, అయితే ఎంత కాలం బతికి ఉంటుందో చెప్పలేమని వైద్యులు చెప్పారు. గత ఏడేళ్లలో ఇలాంటి పిల్లలు ముగ్గురు పుట్టారని, అయితే ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, మూడో పిల్లవాడికి చికిత్స కొనసాగతోందని ఎస్ఎన్సీయూ ఇన్ ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ దూబే అన్నారు. తండ్రి వీర్యంలో అసాధారణత వల్ల ఇలాంటి బిడ్డ పుడుతుందని ఆయన వెల్లడించారు. 

Leave a Comment