బ్యాంక్ లాకర్ లో మరకత శివలింగం..విలువ రూ.500 కోట్లు..! 

తమిళనాడులోని తంజావూరులో ఓ వ్యక్తి బ్యాంకు లాకర్ నుంచి మరకత శివలింగాన్ని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. తిరుక్కువలై ఆలయంలో అపహరణకు గురైన ఆ విగ్రహం లాకర్ లోకి ఎలా వచ్చిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

తంజావూరు అరులానందనగర్ లోని ఓ ఇంట్లో పురాతన విగ్రహం ఉన్నట్లు చెన్నైలోని విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంట్లో ఉండే అరుణా భాస్కర్ అనే వ్యక్తిని విచారించారు. తన ఇంట్లో ఏమీ లేదని భాస్కర్ చెప్పాడు. తన తండ్రి స్వామియప్పన్ చనిపోయాడని, అంతకుముందు ఆయన వద్ద ఉన్న విగ్రహం బ్యాంక్ లాకర్ లో ఉండవచ్చిన తెలిపాడు. 

దీంతో అధికారులు బ్యాంక్ లాకర్ తెరిచి చూశారు. అందులో పచ్చవర్ణ మరకత లింగం బయటపడింది. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ మరకత శివలింగం విలువ రూ.500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విగ్రహం మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని తరుక్కువలై శివాలయంలో మూడేళ్ల క్రితం దొంగతనానికి గురైనట్లు తేలింది. 

 

Leave a Comment