తొపుడుబండిపై  చదువుతున్న బాలుడు.. ఆ తండ్రి కష్టం చూస్తే..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నూతన సంవత్సరం పట్ల ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈక్రమంలో ఆనంద్ మహీంద్రా ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఓ తండ్రి చదువుకుంటున్న తన కుమారుడిని తోపుడు బండిపై తీసుకెళ్తున్నాడు. కొడుకు ఏమో పుస్తకంలో ఏదో రాస్తున్నాడు. 

ఈ ఫొటోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘ఈ ఏడాది నాకు ఇష్టమైన ఫొటో ఇది. ఈ ఫొటోను ఎవరు తీశారో నాకు తెలియదు. ఇది నా ఇన్ బాక్స్ లో కనిపించింది. ఆశ, కృషి, ఆశావాదానికి ఈ ఫొటో నిలువెత్తు నిదర్శనం.. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఫొటో యొక్క సారాంశం.. మరొక్కసారి, నూతన సంవత్సరాన్ని శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

Leave a Comment